ఎలాంటి శక్తి లేకుండా గాలి నుంచి మంచి నీరు 

వెల్లడించిన సింగపూర్‌ పరిశోధకులు

దిల్లీ: సులువుగా గాలి నుంచి నీటిని సంగ్రహించే ఓ వినూత్న ప్రయోగాన్ని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టారు. ఇందులో ఎటువంటి బయటిశక్తిని వినియోగించకుండా గాలిలోంచి నీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు ఇటీవల సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం.. సింగపూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం స్పాంజిలాగ ఉండే ఒక అల్ట్రాలైట్‌ ఎయిరోజెల్‌ను తయారు చేశారు. ఆ ఎయిరోజెల్‌ గాలి నుంచి నీటిని సంగ్రహిస్తుంది. అనంతరం ఆ నీటిని సిద్ధం చేసుకున్న కంటైనర్లలోకి నేరుగా పంపుతుంది. ఒక కిలో బరువున్న ఎయిరోజెల్‌ సుమారు 17లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఎయిరోజెల్‌ను పాలీమర్లతో రూపొందించామని వారు తెలిపారు. ఈ పాలీమర్లు గాలిలో ఉన్న నీటి అణువులను ఆకర్షించి వాటిని ద్రవ రూపంలోకి మారుస్తాయన్నారు. వాతావరణం వేడిగా ఉన్న సమయంలో ఈ ఎయిరోజెల్‌ ఎక్కువగా పనిచేస్తుందన్నారు. ఈ విధంగా ఉత్పత్తి చేసిన నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ‘‘జలచక్రం ద్వారా వాతావరణంలో నిరంతరం నీరు నిండి ఉంటుంది. దీంతో మా ఆవిష్కరణ అన్ని వాతావరణ పరిస్థితుల్లో, తక్కువ ఖర్చుతో మంచినీటిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది.’’ అని పరిశోధకుల్లో ఒకరైన ఫ్రొఫెసర్‌ హో గిమ్‌ వీ తెలిపారు.

ఇవీ చదవండి..

దేశానికి బెంగాల్‌ అమూల్య సంపదనిచ్చింది

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. జీతంలో కోత

READ  Tensiones en el Mar Rojo: atacaron a un carguero iraní señalado como foundation de la Guardia Revolucionaria

Lascia un commento

Il tuo indirizzo email non sarà pubblicato. I campi obbligatori sono contrassegnati *