అక్కడ ప్రతి సంవత్సరం 60 రోజులు ఉదయించడట.. ఎందుకంటే..

సూర్యుడు లేని జగమే లేదు.సూర్యుడు రాని రోజే లేదు కదా.! మనం సూర్యుడు లేని ఒక్కరోజును కూడా ఉహించుకోలేము.సూర్యుడే కనుక లేకపోతే మన ప్రపంచానికి వెలుగు అనేది ఉండదు.

అంతా చీకటి మయంతో ఉంటుంది.పొద్దున అయిందంటే చాలు అందరం సూర్యుడికోసం ఎదురుచూస్తాం.

సూర్య కిరణాలను చూసాక గాని మనం ఏ కార్యకలాపాలు అయిన చేయం.అలాంటిది 65 రోజుల పాటు సూర్యుడు ఉదయించకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించండి.

TeluguStop.com - అక్కడ ప్రతి సంవత్సరం 60 రోజులు ఉదయించడట.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఉహించుకోవడానికే భయంగా ఉంది కదా.కానీ ఇది నిజమే.అమెరికాలోని ఓ నగరంలో 42 రోజుల క్రితం అస్తమించిన సూర్యుడు.మళ్లీ ఇప్పటిదాకా ఉదయించలేదు.ఇన్ని రోజులు అక్కడ ఉదయం అన్నదేలేదు.ప్రజలు సైతం వెలుగుని చూడలేదు.

అక్కడ పగలు లేదు.పూర్తిగా 24 గంటలూ అక్కడే రాత్రే ఉంటుంది.

అక్కడ మొత్తం చీకటే.అసలు ఏ ప్రాంతం ఎక్కడ ఉంది.? ఎందుకు ఇలా సూర్యుడు ఉదయించడు అనే విషయాలు తెలుసుకుందాం.

వివరాలలోకి వెళితే.

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో “ఉట్కియాగ్విక్” నగరంలో ప్రతి ఏడాది 2 నెలల పాటు (65 రోజులు) రాత్రే ఉంటుంది.ఈ సంవత్సరం నవంబర్ 15న చివరిసారిగా అక్కడ సూర్యుడు అస్తమించాడు.

అంటే ఇప్పటికి దాదాపు 42 రోజులుగా అక్కడి ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు.నిత్యం విద్యుత్ దీపాల వెలుగులోనే ఉంటున్నారు.

మళ్లీ అక్కడ సూర్యుడు ఉదయించేది వచ్చే ఏడాది జనవరి 22వ తేదీనే అంట.చీకటి ఉండే ఈ సమయాన్ని పొలార్ నైట్ “అని పిలుస్తారు.ఎందుకిలా జరుగుతుందంటే.శీతాకాలం సమయంలో ప్రతి ఏడాది ఉట్కియాగ్విక్​ నగరంలో 65 రోజుల పాటు ఇలాగే ఉంటుందట.ఏటా నవంబర్ 15 నుంచి 19 మధ్య మాయమయ్యే భానుడు మళ్లీ తర్వాతి ఏడాది 20వ తేదీ తర్వాతే దర్శనమిస్తాడు.ఉట్కియాగ్విక్.

అలస్కా ఉత్తర ప్రాంతంలో ఉంటుంది.దీని ఉత్తర, దక్షిణ ధృవాలు భౌగోళికంగా ఆర్కిటిక్​ కు చెందినవి.

ఇక్కడ భూమి అంశం వంపు తిరిగి ఉండడం కారణంగా ప్రతి ఏడాది పొలార్​ నైట్ ఏర్పడుతోంది.

ఈ ప్రాంతంలో 60 రోజుల పాటు సూర్యుడు కనిపించడం లేదు.ఈ వంపు అడ్డం వస్తున్న కారణంగా ఉట్కియాగ్విక్ ప్రాంతంలో సూర్యరశ్మి పడడం లేదు.అయితే సూర్యుడి లేకున్నా గాని మరి అంత చిమ్మ చీకటిగా ఉండదు.

కానీ వెలుతురు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.రాత్రి లాగే ఉంటుంది.

మళ్లీ వచ్చే ఏడాది జనవరి 22 వస్తేనే ఇక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో సూర్యుడిని దర్శించుకోగలుగుతారు. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత డిగ్రీలుగా నమోదవుతోంది.

READ  "Mucho miedo": perrito rompió pared y quedó atrapado por huir despavorido de los fuegos artificiales | Sociedad

నిజంగా సూర్యుడు లేకపోతే చాలా ఇబ్బందిపడాలి కదా.వినడానికి మనకే ఆశ్చర్యంగా ఉంది కదా.మరి అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి.

Lascia un commento

Il tuo indirizzo email non sarà pubblicato.